పరమ మూర్ఖుడు
పూర్వకాలంలో వేదవేదాంగ పారంగతుడైన విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ‘పండిత పుత్ర పరమ శుంఠ’ అన్నట్లు ఆయనకు నలుగురు కుమారులు ఉండేవారు. వారి పేర్లు కనుమరుగైపోయి, వారి వ్యసనాలనుబట్టి పేర్లు నిర్ధారణలోకి వచ్చాయి. అలా వరుస క్రమంలో వారు ద్యూతకర్మగా, వ్యభిచారిగా, విషయ లోలుడుగా, నాస్తికుడుగా స్థిరపడ్డారు.
తన కుమారులను ఉద్ధరించడానికిగాను విష్ణుస్వామి వారికి బుద్ధిమాటలు చెప్పి సర్వేశ్వరుణ్ణి ఆరాధించమని సలహా ఇచ్చాడు. వా రంతా నియమ నిష్ఠలతో పూజించి సర్వేశ్వరుని నుండి ‘సంజీవనీ విద్య’ను వరంగా పొందుతారు. తర్వాత ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉండగా, ఒకచోట ఓ పులి ఎముకలు కనిపిస్తాయి. తాము పొందిన సంజీవనీ వి ద్యను పరీక్షించాలనుకుంటారు. మొదటివా డు మంత్రపూత జలాన్ని చిలకరిస్తాడు. దాం తో ఆ ఎముకలు అస్థిపంజరంగా మారతా యి. రెండవవాడు మంత్రపూత జలాన్ని చ ల్లగా అస్థిపంజరానికి రక్త, మాంసాలు వచ్చా యి. మూడవవాడు మంత్రపూత జ లాన్ని చల్లిన తర్వాత చర్మం రూ పుదిద్దుకొని పులి రూపొందింది. నాలుగవవాడు మం త్రపూత జలం చల్లడంతోనే ఆ పులికి ప్రాణం వచ్చింది. ఇంకేముంది, అది వెంటనే ఆ నలు గురిని చంపి తినేసింది. కథ ముగించిన బేతాళుడు రాజును అడుగుతాడు,
“ఆ నలుగురిలో పరమ మూర్ఖుడు ఎవరు?”
విక్రమాదిత్యుడు ఇలా సమాధానం ఇచ్చాడు.
“ప్రాణం పోసిన నాలుగవవాడు పరమ మూర్ఖుడు.”
ప్రసన్నుడైన బేతాళుడు, “పరమేశ్వరుని ఆజ్ఞ మేరకే నేను మీ వద్దకు వచ్చాను మహారాజా! మిమ్మల్ని అనేక రకాలుగా పరీక్షించా ను. మీ తెలివితేటలకు ముగ్ధుడనయ్యాను. అదృశ్యంగా మీ భుజాలమీద నివాసముంటాను” అని భేతాళుడు మాయమైపోతాడు.
- యం.వి.నరసింహారెడ్డి
(‘భవిష్య పురాణం’ నుంచి...)






