యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సర్వే పూర్తి
21-05-2026 04:58 PM
బోథ్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన గావించబడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సర్వే పనులు ప్రారంభమయ్యాయి. ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన ఈ పాఠశాల భవనం సర్వే పనులను నిర్వహణకు హైదరాబాదు నుండి కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ బృందం రావడం జరిగింది. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో పనులు మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కార్యక్రమంలో సతీష్ కుమార్ ఈ అశోక్ మండల సర్వేయర్ లు పాల్గొన్నారు






