21 May, 2026 | 5:34 PM

ఏరియా జీఎం కార్యాలయంలో డ్రైవర్స్ రెస్ట్ హాల్ ప్రారంభం

21-05-2026 04:52 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా జి.ఎం కార్యాలయంలో  నూతనంగా ఏర్పాటు చేసిన డ్రైవర్స్ రెస్ట్ హాల్ ను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెం రాజు గురువారం రోజు న ప్రారంభించారు. డ్రైవర్లకు మెరుగైన సౌకర్యాలు, విశ్రాంతికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు, ఈ రెస్ట్ హాల్ ను ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

నూతన రెస్ట్ హాల్ లో డ్రైవర్లకు సౌకర్యవంతమైన సీటింగ్, విశ్రాంతికి అనుకూలమైన వాతావరణం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ, తమ కోసం ప్రత్యేకంగా ఆధునిక సౌకర్యాలతో రెస్ట్ హాల్  ఏర్పాటు చేసిన ,జి.ఎం  ఎం. షాలెం రాజు కి, సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎస్.ఓ.టు జి.ఎం కోటిరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జి.ఎం  ఎం. షాలెం రాజు  , ఎస్.ఓ. టు జి.ఎం  కోటిరెడ్డి  , ఏజీఎం (సివిల్)  రామకృష్ణ , ఏజీఎం (ఫైనాన్స్ ) బీభత్స   , వి‌కే‌సి‌ఎం ప్రాజెక్టు  ఆఫీసర్   నరసింహారావు  డి.వై.ఎస్.ఇ రాజారాం  , పర్సనల్ మేనేజర్   ఎల్ .తిరుపతి  ,సీనియర్  పిఓ ఎం. మురలి  ,  ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం‌డి  రజాక్ , (ఎస్ సీ/ఏస్ టీ వెల్ఫేర్ జనరల్ సెక్రెటరీ) అంతోటి నాగేశ్వరరావు , ఇతర అధికారులు,యూనియన్ నాయకులు  మరియు డ్రైవర్స్  పాల్గొన్నారు.