రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించిన మహోన్నత నాయకుడు
తుంగతుర్తి రవి
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తుంగతుర్తి రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు
మేడిపల్లి, మే 21 (విజయక్రాంతి): భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని పిర్జాది గూడ, మేడిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అన్నారు. గురువారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను తుంగతుర్తి రవి కార్యాలయంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ
భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ. నేడు మనం వాడుతున్న టెలికాం, సమాచార సాంకేతిక విప్లవానికి ఆయనే పునాది వేశారని, పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ జరిపి, గ్రామాలకు నేరుగా నిధులు అందేలా చేశారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆయన దేశానికి చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని యువత, కాంగ్రెస్ కార్యకర్తలు దేశాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జంగచారి, భాస్కర్, రంజిత్ కుమార్ రెడ్డి, కవిడె కుమార్, మోహన్ కుమార్, అడ్వకేట్ నాగరాజు, మహ్మద్ మజర్, బర్రె నాగరాజు, సోమయ్య, శరత్ గౌడ్, కపిల్, మహిళా అధ్యక్షురాలు దుర్గా, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






