21 May, 2026 | 6:06 PM

ఉపాధిహామీ పనిలో కూలీ అస్వస్థత.. స్పందించిన సర్పంచ్

21-05-2026 05:02 PM

కోనరావుపేట, మే 21(విజయక్రాంతి ): కోనరావుపేట మండలంలోని శివంగళపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద ఈస్కిల్లా చంద్రయ్య ఎండ తీవ్రత కారణంగా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న తోటి కూలీలు, గ్రామ సర్పంచ్ అంబటి చైతన్య శేఖర్ సహాయంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ అంబటి చైతన్య శేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపాధి పనులను గ్రామానికి ఒక కిలోమీటరు పరిధిలోనే కల్పించాలని కోరారు. అలాగే కూలీలు ఉదయం తొందరగా పనులకు వెళ్లి ఉదయం 10 గంటల లోపు పనులు ముగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి పని ప్రదేశంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. ఈ ఘటనలో సహకరించిన తోటి కూలీలు మరియు గ్రామస్థులకు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.