అభ్యాసంతో భక్తియోగ సాధన
మోక్షానికి ‘భగవద్గీత’ అనేక మార్గాలను సూచించింది. మానవ ప్రవృత్తి అనేకమందిలో అనేక విధాలు. అందువల్ల ఎవరి ప్రవృత్తికి అనుగుణంగా ఉండే మా ర్గాన్ని వారు అనుసరించడానికి వీలుగా పరమాత్మ కర్మమార్గాన్ని, జ్ఞానమార్గాన్ని, భక్తి మార్గాన్ని సూచించారు. అందులో ‘భక్తియోగం’లో ప్రవచిం చిన భక్తి మార్గమే అందరికీ సులభమైందని ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు అంటారు.
విశ్వరూప సందర్శన యోగంలోనే ఆ యన తన రూపాన్ని అనన్య భక్తి వల్లనే చూ డడానికి వీలవుతుందని ప్రవచించాడు. భగదర్పణంగానే కర్మలను చేస్తూ, లౌకిక విష యాల మీద ఆసక్తిని త్యజించి పరమాత్మే ప రమ ప్రాప్యుడుగా నమ్మినవాడే తనను పొందుతాడని చెప్పా డు. ఈ రకంగా శ్రీకృష్ణుడు భక్తియోగానికి బీజాలు వేశాడు.
‘సగుణోపాసన (విగ్రహారాధన) గొప్పదా? లేక నిర్గుణోపాసన (నిరాకార బ్రహ్మోపాసన) గొప్పదా?’ అన్న ప్రశ్నకు పరమాత్మ, తనమీద నిరంతరం మనసును లగ్నం చెయ్యడం, తనను ధ్యానించడం, తనమీద శ్రద్ధ (విశ్వాసం) కలిగి వుండడం ప్రధానం గాని ఉపాసనా పద్ధతి ఏదైనా ఫరవాలేదని చెప్పాడు. అయితే, నిర్గుణోపాసన కష్టమైందని, అందరికి సాధ్యం కాదని, అందువల్ల సగుణోపాసనే అందరికీ అనుసరణీయమైందని చెప్పాడు.
భగవంతుని మీదే మనస్సు నిలపడం సాధ్యం కాకపోతే దాన్ని అభ్యాస యోగం తో సాధించవచ్చు. అదికూడా సాధ్యం కాకపోతే దైవ సంబంధ కర్మలను (ఆలయాన్ని శుభ్రంగా ఉంచడం వంటివి) చె య్యమని, అదికూడా సాధ్యం కాకపోతే ఏ కర్మ చేసి నా దాన్ని ఈ శ్వరార్పణ దృష్టితో చెయ్యమని అన్నాడు. కర్మఫల త్యాగమే ఉత్తమమైన మార్గమని ప్రవచించాడు. ద్వేషం లేకపోవడం, భూతదయ కలిగి ఉండడం, భయం, క్రోధం లేకపోవడం ముఖ్యమనీ అన్నాడు. కోరికలను త్యజించి సుఖదుఃఖాలకు అతీతుడుగా ఉంటూ, మానావమానాలు, శీతోష్ణాలు మొదలైన ద్వంద ప్రకృతులను అధిగమించాలన్నాడు.
శంకరులు జ్ఞానులకు నిరాకార నిర్గుణ బ్రహ్మోపాసనను వివరించినా సామాన్యులకు భక్తియోగాన్ని బలపరిచారు. అం దువల్ల రచించినవే ‘భజగోవింద’ శ్లోకాల వంటివి. ఇక శ్రీరామానుజులు, శ్రీమధ్వాచార్యులు భక్తియోగాన్నే సమర్థించారు.
‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో,
‘వేదాంత పరిభాష’ నుంచి..
- కళానిధి సత్యనారాయణ మూర్తి






