21 May, 2026 | 8:59 PM

ఆనందం మన చేతిలోనే!

23-08-2024 12:00 AM

27న ఆనందమయి మాత వర్ధంతి :

“మీరు మీ స్వంత శరీరాన్ని ప్రేమిస్తున్నట్లుగా, ప్రతి ఒక్కరినీ మీ స్వంత శరీరంతో సమానంగా పరిగణించండి. సర్వోన్నత అనుభవాన్ని పర్యవేక్షించినప్పుడు, ప్రతి ఒక్కరి సేవ ఒకరి స్వంత సేవగా తెలుస్తుంది. దానిని పక్షి, కీటకం, జంతువు లేదా మనిషి అని పిలవండి. మీరు ఇష్టపడే ఏ పేరు అయినా, ప్రతి దానిలోనూ ఆ రకమైన దివ్యానుభూతిని పొందాలి.”

ఆదర్శవంతమైన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ప్రసిద్ధ భారతీయ సాధువు, ఆధ్యాత్మిక వేత్త ఆనందమయి మాత. ఆమె అందరికీ ఒకే విధమైన ఆధ్యాత్మిక పద్ధతులను సూచించలేదు. తనకు తానుగా, ప్రతీ వ్యక్తి సహజ స్వభావం ప్రకారం ముందుకు సాగవచ్చునని ప్రబోధించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించింది. 

ఆనందమయి మాత అసలు పేరు ని ర్మల సుందరి. భక్తులు ఆమెను దుర్గా అవతారంగా ఆరాధించేవారు. ‘ఆనందమయి మాత’ అంటే ‘ఆనందం వెల్లివిరిసిన తల్లి’ అని అర్థంగా భక్తులు చెప్తారు. 30 ఏప్రిల్ 1896న సనాతన బెంగాలీ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నిర్మల సుందరి చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు మళ్లారు. ఆమె తల్లి మోక్షదా సుందరి దేవి, తండ్రి బిపిన్ బిహారి భట్టాచార్య. ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని తిప్పెరా జిల్లా (ఇప్పుడు బ్రాహ్మణ బారియా జిల్లా) ఖోరా గ్రామం ఆమె జన్మస్థలం. శ్రీ అరవిందులు, రమణ మహర్షి వంటివారి సమకాలీనురాలైన ఆమె 86 ఏళ్ల వయసులో 1982 ఆగస్టు 27న డెహ్రాడూన్‌లో భౌతిక ప్రపంచాన్ని వీడారు.