1 June, 2026 | 12:02 PM

Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •  

సమగ్ర కుల జనగణన చేపట్టాలి

13-04-2026 01:16 AM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): జాతీయస్థాయిలో సమగ్ర కుల జనగణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నగరంలోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ‘క్యాస్ట్ సెన్సెస్ డీపె నింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’ అనే పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడారు. జాతీయస్థాయిలో నిర్వహించే జనగ ణనలో అన్ని కులాల సామాజిక, విద్య, ఆర్థికస్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులసర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా సమగ్ర కుల జనగణన చేపట్టడానికి  మార్గద ర్శకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ‘క్యాస్ట్ సెన్సెస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’ పుస్తక రచయిత, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్ జి. కిరణ్ కుమార్, డాక్టర్ వాహిని బిల్లు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిపాలనను బలోపేతం చేయడంలో, సామాజిక న్యాయాన్ని మరింత లో తుగా స్థాపించడంలో కులలెక్కింపు ప్రాధాన్యతను ఈ గ్రంథం స్పష్టంగా ప్రతిపాదిస్తుందని రచయితలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పుస్తకావిష్కరణ అనంతరం డిప్యూటీ సీఎం బీసీ ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్, మే ధావులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులంతా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డి. అశోక్, సురేందర్, గణేష్, శివ, అరవింద్, లక్కీ, ప్రవీణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.