13 April, 2026 | 4:11 AM

ఆరుగాలం కష్టం బూడిద పాలు

13-04-2026 01:15 AM

20 రోజుల్లోనే 12 చోట్ల మొక్కజొన్న దగ్ధం 

దిక్కు తోచని స్థితిలో అన్నదాతలు

ఆదుకోకపోతే అప్పులే 

కుబీర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఆరుగాలం ఎండనక వాననక. కష్టపడి పండిం చిన పంట చేతికొచ్చే దశలో  అగ్గి కి ఆహుతి అవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో వారం రోజుల్లోనే 12 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో పంట చేతికొచ్చి పెట్టుబడి వస్తుందన్న ఆశలను అడియాశలు చేస్తూ అనుకోని అగ్నిప్రమాదాలు ఆ రైతు కుటుంబాల జీవితాల్లో చీకటి విషాదని నింపుతున్నాయి.

గత వారం రోజులుగా నిర్మల్ జిల్లాలో పంట పొలాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్ సారంగాపూర్ కుబీర్ కుంటాల లోకేశ్వరం నర్సాపూర్ ముధోల్ బాసర్ దిల్వార్పూర్ మామిడా లక్ష్మణ్ చందా తదితర మండలాలు ఈ యాసంగిలో సంఖ్యలో రైతులు ప్రధానంగా మొక్కజొన్న, జున్ను తదితర పంటలను సాగు చేశారు. పంట చేతికి రావడంతో పూత పూసి నూర్పిడి చేసేందుకు పంటచేరిలో ఆరబెడుతున్న సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగి మొత్తం పంట ఖాళీ బూడిదవుతుంది. 

వారం రోజుల్లోని 12 ప్రమాదాలు..

నిర్మల్ జిల్లాలోని పాగా ప్రాంతాల్లో గత వారం రోజుల్లోనే 12 చోట్ల పంటచెర్లలో అగ్ని ప్రమాదాలు జరగగా సుమారు 10 లక్షల విలువ చేస్తే మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ జి మండలం టింబుర్ని గ్రామంలో మూడు రోజుల క్రితం శ్రీధర్ రెడ్డి శ్రీనివాస్ ప్రశాంత్ కు చెందిన 8 ఎకరాల మొక్కజొన్న పంటకు అగ్గి తగిలి పూర్తిగా కాలిపోయింది. దీని విలువ 4 లక్షల వరకు ఉంటుంది.

కుబీర్ మండలంలోని చేత గ్రామానికి చెందిన అశ్విని అనే రైతుకు చెందిన రెండెకరాల మొక్కజొన్న కాలిపోగా 50వేలకు నష్టం జరిగింది. అదే మండలం లో సిరిపెల్లి పాలసీ మొగం తదితర గ్రామాల్లో వారు రోజుల క్రితం ముగ్గురు రైతులకు చెందిన మొక్కజొన్న కాలిపోయింది. కుంటాల మండలం లింబా ద్ గ్రామానికి చెందిన ఓ రైతు మూడు ఎకరాల పంటను కాలిపోగా లక్షన్నర రూపా యల నష్టం జరిగింది. అదేవిధంగా లోకేశ్వరం ముధోల్ తానూర్ తదితర మండ లాల్లో కూడా అగ్నిప్రమాదం జరిగి మొక్కజొన్న కాలిపోయినట్టు రైతులు వాపోతున్నారు.

అసలు ఎండాకాలం ఆపై గాల్పుల ప్రభావంతో మొదటగా ఎండిన మొక్కజొన్న లేపాకులకు తగిలి అది గాలి కారణంగా పంట చేను మొత్తం ఆవరించడంతో అగ్ని ప్రమాదాన్ని నియంత్రించేందుకు రైతులు చర్యలు తీసుకుంటున్న ఫలితాలు ఇవ్వడం లేదు. కొందరు రైతులు రోడ్డుపై వెళ్లేవారు తాము తాగిన వీడిని రోడ్డుపై వెళ్లడం వల్ల అది గాలికి పంటచెల్లలు చెత్తకు తగిలి ప్రమాదాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. దీనికి తోడు పంట పొలాలపై వెళ్లే వైర్లు గాల్పుల కారణంగా తగల డంతో షార్ట్ సర్క్యూట్తో నిప్పు రవ్వలు పంట పొలం పై పడటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు రైతులు పేర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పంటచేళ్ళకు అగ్గి తగిలితే నిర్మల్ బైసా నుంచి అగ్నిమాపక సిబ్బంది రావలసి ఉంటుంది. వీరు పంట పొలానికి రావడానికి గంట సమయం పట్టడం వల్ల అప్పటికి ఆ పంట చేను మొత్తం కాలి బూ డిద అయిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన మొక్కజొన్న కావడంతో మంటలు ఆర్పడానికి రైతులు ప్రయత్నిస్తున్న అవి సాధ్యం కావడం లేదు. దీంతో రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది 

పెట్టుబడి.. ఆదాయం రెండు నష్టం..

నిర్మల్ జిల్లాలో గత వారం రోజులుగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు రైతుకు కంటికి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. యాసంగిలో రైతులు తమ పంట భూముల్లో డిసెంబర్ జనవరిలో మొక్కజొన్న సాగు చేశారు. దుక్కులు దున్ని విత్తనాలు వేసుకొని కలుపు తీసి రసాయన మందులు వేసి పంట చేతికి వస్తే కోత కోసి పంట చేతికి వచ్చి ఆదాయం అందే సమయంలో ఈ ప్రమాదం జరుగుతుంది. ఎకరానికి రైతులు 20000 వరకు పెట్టుబడి పెట్టారు ఎకరానికి 35 కుంటల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఆశతో పెట్టుబడి పెట్టారు.

70 వరకు ఆదాయం వచ్చే పంట అనుకోని అగ్నిప్రమాదంలో పెట్టిన పెట్టుబడి వచ్చే ఆదాయం అగ్నిప్రమాదం రూపం లో కబళించడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పంట కాలిపోయిన తర్వాత సర్వే నిర్వహించి అధికారులకు నివేదిక ఇచ్చిన పరిహారం విషయంలో ప్రభు త్వం వద్ద స్పష్టమైన ఆదేశం లేకపోవడంతో అన్నదాతకు అగ్గి ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.