అబద్ధపు పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, మే 5: అబద్ధపు హామీల పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆదివారం ఆయన అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని ఏఆర్ బృందావన కాలనీ, బృందావన్ టీచర్స్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయా కాలనీల సంక్షేమ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీలను అము ల చేస్తామని ప్రగల్భాలు పలికి సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు తప్పించుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమీన్‌పూర్ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రజలు ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మె ల్యే వెంట మున్సిపల్ కౌన్సిలర్లు, కోఛాఆప్షన్ సభ్యులు, సీనియర్ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




