అనాజ్‌పూర్‌లో జోరుగా ప్రచారం
ఇబ్రహీంపట్నం, మే 5 (విజయక్రాంతి) : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి చామల డింపుల్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఆదివారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, అనాజ్ పూర్ గ్రామంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కోడలు మల్‌రెడ్డి స్నేహ అభిషేక్‌రెడ్డితో కలిసి గడపగడపకు తిరిగి ప్రచారం చేశా రు. హస్తం గుర్తుకు ఓటు వేసి చామ ల కిరణ్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్ర మంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌రెడ్డి, రంగా రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయమ్మ ముదిరాజ్, అనాజ్ పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.




