17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్ర

10-06-2025 01:13 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ విమర్శలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒకే ఏజెండాతో తమ పార్టీ అధినేత కెసీఆర్‌ను బద్నాం చేయాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం మాత్రమే కాదని, అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమష్టిగా నిర్ణయం తీసుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్‌తో పాటు హరీశ్‌రావు స్పష్టం చేశారన్నారు. కేసీఆర్ కొత్తగా చెప్పేదేమీ ఉండదంటూ సోమవారం కేటీఆర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కాళేశ్వరం అంశంలో దాచాల్సిందేమీ లేదన్నారు.