17 August, 2026 | 5:03 PM

నిషేధిత జాబితాలో సీఎం ఇల్లు.. మరి ప్రజల పరిస్థితేంటి?

17-08-2026 03:58 PM

సీఎం పరిస్థితే అలా ఉంటే.. ప్రజల పరిస్థితి ఏంటి?

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇల్లు కూడా రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాలో ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సోమవారం నాడు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. . బ్లాక్ లిస్ట్ నుంచి తీయాలంటే కమిషన్ అడుగుతున్నారని తెలిపారు. రెవెన్యూలో ఏ పని జరగాలన్న 30 శాతం ఇవ్వాల్సిందేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారుసీఎం ఇల్లు నిషేధిత జాబితాలో ఉన్నందునే తొలగించాలని హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం పరిస్థితి అలా ఉంటే.. ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.

నిషేధిత జాబితాలో ఆస్తులు ఎందుకు పెట్టారో విచారణ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ఎన్ని ఆస్తులు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. నిషేధిత జాబితాలోని భూములను ఎప్పటి లోపు తీస్తారో చెప్పాలన్నారు. నిషేధిత జాబితా భూముల గురించి ఆర్టీఐ ద్వారా అడుగుతుంటే సమాధానం లేదని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 1999లోనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశారని సూచించారు. అడ్డుగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరూర్ నగర్ లోని భూములను బ్లాక్ లిస్టులో పెట్టారని తెలిపారు. KCR పేరు ఉండొద్దనే పథకాలు తీసేస్తున్నారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై కావాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు.