30 April, 2026 | 2:47 AM

పదిలో శతశాతంకు పట్టాభిషేకం

30-04-2026 01:00 AM

జిల్లా వ్యాప్తంగా పేద విద్యార్థులకు శిక్షణ 

17 మండలాల్లో 14 మండలాల్లో శతశాతం విద్యార్థులే టాపర్లు 

చదువు ఒక్కటే పేదరికం తుడిచి వేస్తుంది: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఏఫ్రిల్ 29 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాలు స్ఫూర్తిదాయకంగా వచ్చాయి. తమ నియోజకవర్గ విద్యార్థులకే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులకు 17 మండలాలలోని 14 పాఠశాలలను ఎంపిక చేసి శతశాతం అనే పేరుపై ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించిన విద్యార్థులే జిల్లాస్థాయిలో ర్యాంకులు రాబట్టడంతో మహబూ బ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆలోచింపజేస్తుంది.

చదువు ఒక్కటే పేదరికం తుడిపేసే శక్తి ఉంటుందని ప్రతి పేద విద్యార్థికి ఉన్నత చదువు అందుబాటులోకి వస్తే సమాజం అన్ని రంగాలలో అద్భు తాలు సృష్టిస్తుందని మొదటి నుంచి చెబు తూ అందరి ఆలోచనలను చదువు వైపు మళ్ళించేలా ఎమ్మెల్యే కృషి చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్న మాట. 

ఐఐఐటీ లక్ష్యంగా శిక్షణ 

మహబూబ్ నగర్ నగరం లో ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొన్న 150 మంది విద్యార్థుల్లో 40 మంది విద్యార్థులు 530 ఆపై మార్కులు సాధించారు. వారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సన్మా నించారు. 17 మండలాల్లో 14 మండలాల్లో శతశాతం పాఠశాలల విద్యార్థులే టాపర్లుగా మార్కులు సాధించడం వెనుక గురువుల కృషి, తల్లిదండ్రుల సహకారం సమాజం భాగస్వామ్యం కావలసిన అవసరం ఉంది. మార్కులు మాత్రమే విజయానికి ప్రమాణం కాదని, లక్ష్యంతో కష్టపడి ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది.

 నేను సాధించగలను ఆత్మవిశ్వాసం అవసరం

 క్రమశిక్షణతో ముందుకు సాగాలి, చదువే జీవితాన్ని మార్చే ప్రధాన సాధనమని, చదువుతోనే కుటుంబానికి గౌరవం, స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. వచ్చే 45 సంవత్సరాలు పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాలని, మొబైల్ ఫోన్లు, సినిమాలు వంటి దారి తప్పించే అంశాల నుండి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. జిల్లాలో నిర్వహించిన శతశాతం శిక్షణా శిబిరాలు, కోచింగ్ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అందులో పాల్గొన్న గురువులు, అధికారులు, సిబ్బంది అందరికీ అభినందనీయం. 

8వ, 9వ, 10వ తరగతులకు కూడా శతశాతం : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

గురుకుల, పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒక గ్రామం మొత్తం కలిసి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలంటే, వాటిని ప్రచారం చేయడం అత్యవసరమని, వాట్సాప్ గ్రూపులు ఇతర వేదికల ద్వారా ఈ విజయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు.

పాఠశాలల్లో కంప్యూటర్ సదుపాయాలను పెంచి, ప్రతి విద్యార్థికి టెక్నాలజీ పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మొత్తంగా, విద్యార్థులు ఈ విజయాన్ని మొదటి అడుగుగా భావించి, తమ లక్ష్యాలను చేరుకునే వరకు క్రమశిక్షణతో కృషి చేయాలని, చదువే వారి భవిష్యత్తును నిర్మించే ప్రధాన మార్గమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ కో ఆర్డినేటర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.