ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, కొనుగోళ్లలో వేగం పెంచాలని నిర్వాహకులకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ 150, ఐకెపి 50, గిరిజన కార్పొరేషన్ 8, మెప్మా 1, శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం 209 కేంద్రాల నుండి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3934.860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
అకాల వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం మ్యాచర్ వచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని, ధాన్యం కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, రవాణా చేయు విషయంలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను సిద్ధం చేయాలని, గన్ని సంచులు, మ్యాచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, టెంట్లు, చేర్లు, తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కొనుగోళ్లు చేసిన దాన్యంకు సంబంధించి రైతుల ఖాతా వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు త్వరగా పడే విధంగా సంబంధిత సెంటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, సివిల్ సప్లై అధికారి రమేష్, మేనేజర్ సివిల్ సప్లై నరసింహరావు, సంబంధిత నిర్వాహకులు పాల్గొన్నారు.






