2 July, 2026 | 12:26 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ఎప్పటికీ మరచిపోలేని రోజది

29-07-2024 12:05 AM

25-11-2023 తేదీని ఎప్పటికీ మరచిపోలేనంటోంది దుషారా విజయన్. ఇటీవల విడుదలైన ‘రాయన్’ సినిమాలో సినిమాలో ధనుష్ చెల్లెలిగా నటించిన ఆమె, ఈ చిత్రంలోని తన నటనతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. కాగా ఈ సినిమా సంగతులును నెమరు వేసుకుంటూ గతంలోకి వెళ్ళిన దుషారా.. “ఆ రోజున ధనుష్ మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. ఆయన 50వ సినిమా కోసం సంప్రదించారు. మొత్తానికి ధనుష్‌ని కలుసుకున్నాను. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కట్ చేస్తే.. రాయన్ విడుదలై ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ విజయం ఆయనదే అయినా నాదే అన్నట్టు అనిపిస్తుంది.

ఈ ప్రయాణంలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన ప్రతి చర్య ఎంతో స్ఫూర్తినిచ్చింది. అసలైన మార్గదర్శిగా మీరు” అంటూ భావోద్వేగ భరితంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది. ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనంతా గుర్త తెచ్చుకున్న దుషారా, ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ‘సర్‌పట్టా’ సినిమాతో తన ప్రతిభని చాటిన దుషారా.. ‘వేట్టయాన్’, ‘వీర ధీర శూరన్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.