21 March, 2026 | 1:09 PM

Breaking News

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •  

‘ఫన్ గ్లింప్స్’తో రానున్న రాజాసాబ్

29-07-2024 12:05 AM

‘కల్కి’ సినిమాలో కర్ణుడిగా కనపడి ప్రేక్షకుల్ని అచ్చెరువొందించిన ప్రభాస్, ప్రస్తుతం ‘రాజాసాబ్’ ముస్తాబవుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌ని చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వారికి ఓ తీపికబురు అందించారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ మునుపెన్నడూ చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో రానున్న ఈ సినిమా నుంచి ‘ఫన్ గ్లింప్స్’ నేడు విడుదల చేయనున్నారు మేకర్స్.

ఈ మేరకు ఓ పోస్టర్‌ని ఆదివారం విడదల చేశారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో లుంగీ మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన ప్రభాస్, తాజా పోస్టర్‌లో పింక్ సూట్ ధరించి స్టులిష్‌గా కనపడుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తమకు ఎంతో ప్రత్యేకమని తొలి నుంచి నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం సాయంత్రం 5.03 గంటల నుంచి ‘రాజాసాబ్’ ఫన్ రైడ్ మొదలనుంది.