20-12-2025 12:00:00 AM
బీజేపీ ఇన్‌చార్జిని కలిసిన నూతన పాలకవర్గం
మహేశ్వరం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): నియోజకవర్గంలోని మహేశ్వరం మండలంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మలూరు గ్రామ సర్పంచ్‌గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తుమ్మేటి ఆండాలు కృష్ణ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కృష్ణయాదవ్ తమ వార్డు మెంబర్లతో కలిసి మం డల అధ్యక్షులు యదీష్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పాలక వర్గాన్ని శ్రీరాములు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు విద్యాసాగర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రామ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గోల్కొండ రఘువీర్, సీహెచ్ మల్లా రెడ్డి, తుమ్మలూరు గ్రామ ఎన్నికల ఇంచార్జ్ పేరామోని నరేష్ యాదవ్, వార్డు మెంబర్లు, బీజేపీ, బీజేవైఎం నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.