బాధిత కుటుంబానికి కల్వకుంట్ల కవిత కొండంత భరోసా
గుండాల, జూలై 9 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలోని శంభునిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవంలోనే తల్లి, నవజాత శిశువు మృతి చెందిన విషయం తెలుసుకొని, టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాధిత కుటుంబ స్వగ్రామంలో చాట్ల వనజ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని, మారుమూల ప్రాంతంలో కనీస వైద్య సదుపాయాలు లేక వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో ఒక కుటుంబం రోడ్డున పడిందని, ఆ కుటుంబం రోడ్డున పడడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వనజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, వారికి న్యాయం జరిగే వరకూ ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని ఆమె తెలిపారు.
అనంతరం మండల కేంద్రంమైన గుండాలలో ప్రముఖ పత్రిక స్టేట్ బ్యూరో వెలిశాల ఫల్గుణా చారి సోదరుడు ’విజయక్రాంతి’ కంట్రిబ్యూటర్ వెలిశాల నరేష్ స్వగృహానికి విచ్చేసి తేనిటీ విందులో పాల్గొన్నారు. కల్వకుంట్ల కవితకు వెలిశాల బ్రదర్స్ తల్లిదండ్రులు ఆమెకు ఆప్యాయంగా స్వాగతం పలికి ఆడబిడ్డగా భావించి చీరేసారేలు పెట్టారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని కవితకు ఘన స్వాగతం పలికారు.






