7 May, 2026 | 2:31 AM

ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

07-05-2026 01:59 AM
  1. ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం
  2. మాట తప్పితే అమరవీరుల స్థూపం వద్ద రాళ్లతో కొట్టండి
  3. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

పంజాగుట్ట, మే 6 (విజయక్రాంతి): ఫీజుల నియంత్రణకు ఈ నెలలోనే చట్టం తేవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టటంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య,- ఫీజుల నియంత్రణ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అవినీతిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కే కుట్రలను వెంటనే మానుకోవాలన్నారు.

ఫీజు దోపిడీని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే ప్రైవేట్ విద్య సంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు పెంపు లేకుండా జీవో జారీ చేయాలన్నారు. పిల్లలను బాగా చదివించాలన్న తల్లితండ్రుల వీక్ నెస్‌ను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ సంస్థలు అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నాయని మండిపడ్డా రు.  త్వరలోనే తమ తో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ల వద్ద ఆం దోళన చేస్తామన్నారు.

ప్రైవేట్ విద్యా సం స్థల దోపిడీని అరికట్టకపోగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా బొందపెట్టే కుట్ర ఈ ప్రభు త్వం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎంఎస్ జీవోతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళంపాడే ప్ర య త్నం చేస్తున్నారన్నారు. 

ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన జీవోను  రద్దు చేయాలని, రూ. 11వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల యాలని  డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప బ్లిక్ స్కూల్‌లో అడ్డగోలు అవినీతి జరుగుతున్నదని, ఈ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.  తాము అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుప త్రు ల్లో కూడా పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. మాట తప్పితే అమరుల స్థూపా నికి కట్టేసి రాళ్లతో కొట్టాలన్నారు.