పెరిక కార్పొరేషన్ చైర్మన్‌గా వెంకటేశ్వర్లు
07-05-2026 02:00 AM
సూర్యాపేట, మే 6 (విజయక్రాంతి): తెలంగాణ పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్‌గా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన దొంగరి వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పీసీసీ సభ్యుడిగా, పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయన పెరిక కుల అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
కాగా నూతనంగా చైర్మన్‌గా ఎంపికైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే మొదటిసారి తెలంగాణ పెరిక కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన వెంకటేశ్వర్లును రాష్ట్ర, జిల్లా పెరిక కుల సంఘ నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు అభినందించారు.






