21 April, 2026 | 4:09 AM

గాయపడ్డ సింహంలో హాస్యం కొత్తగా ఉంటుంది

21-04-2026 02:42 AM

తరుణ్ భాస్కర్ హీరోగా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ నిర్మిం చారు. ఫరియా అబ్దుల్లా, మాన స చౌదరి కథానాయికలు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను డైరెక్టర్ విలేకరులతో పంచుకున్నారు. “షార్ట్ ఫిలిమ్స్  తర్వాత కొన్ని సినిమాలకు పనిచేసే అవకాశం వచ్చింది. దర్శకుడిగా ‘గాయపడ్డ సింహం’తో వస్తున్నా.

ఈ కథకు టిపికల్ హీరో అవసరం లేదు. ఇందులో హీరో క్యారెక్టర్.. హీరోగా ఫీల్ అయితే ప్రేక్షకులు నవ్వు రావాలి. అందుకే తరుణ్ భాస్కర్‌ను ఎంచుకున్నా. ‘సింహం’ అంటే బాలకృష్ణ గుర్తుకొస్తారు. అలాంటి వ్యక్తులకు ఉండే టైటిల్స్‌ను తరుణ్ భాస్కర్ లాంటి క్యారెక్టర్‌కు పెడితే ఖచ్చితంగా కాంట్రాస్ట్‌గా ఉంటుందని ఈ టైటిల్ పెట్టాం. ఇందులో తరుణ్ భాస్కర్ తన ప్రేమ కోసం అమెరికా వెళ్లి, అక్కడ డిపోర్టేషన్‌కు గురై మళ్లీ ఇండియాకు వస్తాడు. ఏ కారణం చేత తిరిగి వచ్చాడు? ఆ ఫ్రస్ట్రేషన్‌తో తీసుకునే నిర్ణయాలతో కూడిన హాస్యం, వినోదం చాలా కొత్తగా ఉంటాయి” అని చెప్పారు.