21 April, 2026 | 4:07 AM

టీఎఫ్‌డీఏ కోసం సినిమాల నిర్మాణం

21-04-2026 02:40 AM

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌డీఏ) ఆధ్వర్యంలో ముప్పు కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీఏ సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు.

అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, ట్రెజరర్ సాయిరాజేశ్, వైస్ ప్రెసిడెంట్ సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్‌కుమార్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై ప్రసంగించారు. వీఎన్ ఆదిత్య మాట్లా డుతూ.. “నిర్మాతలుంటేనే మా దర్శకులు మనుగడ కొనసాగించగలరు. చదలవాడ శ్రీనివాసరావు ఆయన బ్యానర్‌పై ముప్పు కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమాల్లో లాభాలు వస్తే.. యూనియన్‌కు ఇస్తానని చదలవాడ చెప్పారు.

ఇది మాకు వరం. ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. మా అసోసియేషన్‌లోని మెంబర్లు చెప్పిన కథలు, బౌండెడ్ స్క్రిప్టుల్ని ఫిల్టర్ చేస్తున్నాం” అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “ఇప్పుడు సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకు కూడా తక్కువ అవకాశాలు వస్తు న్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని అన్నారు.