18 August, 2026 | 2:49 PM

వెల్లువలా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు

16-06-2024 02:15 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (విజయక్రాంతి): భారత్‌లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయమైనప్పటికీ ఒక్క మే నెలలోనే 145 ఒప్పందాలతో ఏకంగా 6.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రియల్ ఎస్టేట్‌తో పాటు ఈ హెల్త్ కేర్, ఫైనాన్షియల్  సర్వీసెస్ లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్‌లో 38 ఒప్పందాలతో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, ఫ్లిప్‌కార్ట్ లో గూగుల్ పెట్టుబడి పెట్టిన 350 మిలియన్ డాలర్లు అతిపెద్ద ఒప్పందంగా చెప్పవచ్చు.

99 ఒప్పందాల ద్వారా 4 బిలియన్ డాలర్ల  పీఈ పెట్టుబడులు వచ్చాయి. జనవరి తర్వాత వచ్చిన అత్యధిక పీఈ పెట్టుబడులు ఇవే కావడం విశేషం. ఒక్కొక్కటీ 100 మిలియన్ డాలర్ల కంటే పైబడిన పెట్టుబడులు కలిగిన తొమ్మిది ఒప్పందాలూ ఉండటం విశేషం. ఇవేకాక ఐదు ఐపీవోల ద్వారా 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే మూడు మరో మూడు క్యూ ఐపీల ద్వారా 0.5 బిలియన్ డాలర్లు వచ్చాయి.