అచ్చంపేట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
18-08-2026 02:26 PM
నర్సాపూర్: అచ్చంపేట గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి, గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్పంచ్ నిరుడి తుల్చమ్మ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును కోరారు. ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధులఅవసరాన్ని వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కూడా కలిసి గ్రామాభివృద్ధి అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తుల్చమ్మ కుమారుడు శివ పుట్టినరోజు సందర్భంగా హరీశ్‌రావు శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ నిరుడి భిక్షపతి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.






