1 April, 2026 | 3:31 AM

బాసర ఆలయానికి మహార్దశ

01-04-2026 12:56 AM

రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ ప్రణాళిక 

6న సీఎం రేవంత్ రెడ్డి రాక 

త్రిఫుల్ ఐటీ సందర్శనపై స్పష్టత కరువు

నిర్మల్, మార్చి ౩1 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయానికి త్వరలో మహర్దశ రానుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి హోదాలో ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 6న రూ.100 కోట్లతో అమలు చేస్తే బాసర మాస్టర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బాసర సరస్వతి ఆల యానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిం చుకోవడం ఆనవా యితీగా వస్తుంది. బాసరలో పెరుగుతున్న భక్తుల సంఖ్య నేపథ్యంలో ఆలయ విస్తరణ పునర్నిర్మాణం మాస్టర్ ప్లాన్ గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్ల పనులపై ఆశలు చిగురిస్తున్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2002లో బాసరలో గోదావరి పుష్కరాలు ప్రారంభించి బాసర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. ఆ తర్వాత 2005లో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 2005లో బాసరకు వచ్చారు. బాసర త్రిఫుల్ ఐటీ భువన సముదాయ శంకుస్థాపన చేయగా 20 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి బాస ర పర్యటన ఖరారు అయింది.  2022లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బాసరకు వచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బాసర ఆలయానికి రానున్నారు. 

2027 జులై ఆగస్టులో జరగనున్న గోదావరి పుష్కరాలు నాటికి బాసర మాస్టర్ ప్లాన్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కార్యక్రమం రూపొందించుకుంది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆర్కిటెక్ నిపుణులతో ఇప్పటికీ రెండుసార్లు చర్చించి భవిష్యత్తు తరాలకు ఇబ్బంది ఉండకుండా మాస్టర్ రూపొం దించినట్లు తెలుస్తోంది.

2027లో జరిగిన గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న బాసర నుండి రాజమండ్రి వరకు గోదావరి తీరంలో టూరిజం డెవలప్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ బాసర నుంచి ఆ పనులు ప్రారంభిం చనున్నారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో బాసర మాస్టర్ ప్లాన్ 100 కోట్లతో పూర్తయితే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండి టూరిజం కేంద్రంగా మరింత అభివృద్ధి చెంది అవకాశం ఉంది.

ట్రిపుల్ ఐటి సందర్శిస్తే మేలు..

తెలంగాణ రాష్ట్రంలోని సాంకేతిక విజ్ఞానం అందించే అతిపెద్ద విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటి (రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీ యూనివర్సిటీ)లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆందోళన నిర్వహణ లోపాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తేనే మేలు జరిగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదంద్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్రిపుల్ ఐటీలో 2022 నుంచి వరుస ఘటనలు యూనివర్సిటీని అప్రతిష్ట పాలు చేస్తూ శాంతిభద్రతల విషయంలో అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

9,000 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ విశ్వవిద్యాలలో నిధుల కొరత, వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత, నిర్వాణ లోపా లు, అధికారు ల ఏకపక్ష నిర్ణయాలు, విద్యార్థుల ఆందోళనలు, రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.  ప్రతిపక్ష నాయకుడిగా టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఏ రేవంత్ రెడ్డి 2022 లో త్రిబుల్ ఐటీలో విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిలిచింది మారువేషన్లో పోలీసుల కళ్ళు కప్పి త్రిఫుల్ ఐటీలో ప్రవేశించారు. అయితే పోలీసులు అతని గుర్తించి పట్టుకొని అరెస్టు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ముఖ్యమంత్రి హోదాలో బాసర ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించింది వస్తున్న సీఎం బాసర త్రిఫుల్ ఐటీ సందర్శించాలని త్రిబుల్ ఐటీ విద్యార్థులు జిల్లా విద్యావేత్తలు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

సీఎం బాసర వస్తున్న తరుణంలో విద్యార్థులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడి సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని  త్రిఫుల్ ఐటీ విద్యార్థి జేఏసీ నాయకులు ఆకాష్ యాదవ్ సూచించారు. ఇప్పటికే సీఎంను హైదరాబాద్‌లో కలిసి రెండుసార్లు వినతిపత్రం అందించినట్లు ఆయన వివరించారు. తప్పకుండా బాసర త్రిఫుల్ ఐటీ వస్తారని తమ సమస్య వింటారని విద్యార్థులు  విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.