calender_icon.png 16 November, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరశైవ లింగాయత్ కార్పొరేషన్‌కు పాలక మండలిని నియమించాలి

16-11-2025 12:00:00 AM

వీరశైవ లింగాయత్  రాష్ట్ర కమిటీ ఎన్నిక

ముషీరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): వీరశైవ లింగాయత్ ల కు ప్రత్యేక కార్పొరేషన్లను ప్రకటించాలని, దానికి వెంటనే ప్రభుత్వం పూర్తిస్థాయి పాలక మం డలిని నియమించి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగబలిజ సంఘం గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంఘమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పాటిల్, ప్రధాన కార్యదర్శి కళ్లపల్లి రాచప్పలు డిమాండ్ చేశారు.

ఈ మేరకు శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ  కోకపేటలో తమకు కేటాయించిన భూమిక రిటెండర్ ను  పిలిచి రూ.25 కోట్లతో భవనాన్ని నిర్మించాలని వీరశైవ లింగాయత్ లింగబలిజాలను ఓబీసీలో చేర్చేందుకు చర్య లు తీసుకోవాలని విద్యా, ఉద్యోగాలలో అవకాశం కల్పించేందుకు ఈడబ్ల్యుఎస్ రిజర్వే షన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

నూతన కమిటి ఎన్నిక...

రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా దినేష్ పాటిల్, ప్రధాన కార్యదర్శిగా కళ్లపల్లి రాచప్ప, కోశాధికారి పట్లోళ్ల శివ చరణ్, క్రమశిక్షణ కమిటి చైర్మన్ గా శెట్టి శివకుమార్, మహిళా అధ్యక్షురాలిగా విద్యుత్ లత, మహిళా ప్రధాన కార్యదర్శిగా అశ్విని, యూత్ అధ్యక్షుడిగా చరణ్, ప్రధాన కార్యదర్శిగా సోమేష్ లు నియమితులయ్యారు.