15-11-2025 11:08:55 PM
అన్ని రాజకీయ పార్టీలు బీసీ లకు అన్యాయం
ఉద్యమ ఉదృతం చేస్తే చేస్తే 42% రిజర్వేషన్లు దక్కుతాయి
కాంగ్రెస్ బీసీ డిక్లేషన్ హామీల వైఫల్యంపై కామారెడ్డిలోఆక్రోశ సభ
కామారెడ్డి (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి బిసి లకు 42 శాతం రిజర్వేషన్ సాధిస్తామని సాధన సమితి చైర్మన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఈశ్వరయ్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో నిర్వహించిన బీసీ ఆక్రోష సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ గ్రామాన బీసీ సైన్యాన్ని సిద్ధం చేయాలని ఉద్యమాన్ని ఉధృతం చేస్తే కాంగ్రెస్ బిజెపి పార్టీలు మెట్టు దిగివచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేస్తాయని 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నేతలు వెల్లడించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ ఆక్రోష సభ నిర్వహించారు. అట్టహాసంగా ఘనంగా జరిగిన సభను ఉద్దేశించి జస్టిస్ ఈశ్వరయ్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు డిఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహరాజ్ తదితరులు మాట్లాడారు.
స్వాతంత్రం సిద్ధించి 78 ఏళ్లుగా బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప కృప ఎన్నికల్లో అగ్రవర్ణాలపై బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన 21 బీసీ అంశాలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందన్నారు. తెలంగాణ ఉద్యమం వలె బీసీ ఉద్యమం నిర్మిస్తామన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఆఖరి రెడ్డి సీఎం అన్నారు. ఐక్యంగా ఉద్యమిస్తే భవిషత్తు బీసీ లదే అన్నారు. బీసీలలో అనైక్యత పెద్ద మైనస్ అంశమన్నారు. ఐక్యత అత్యంత అవశ్యం అవసరమన్నారు. అగ్రవర్ణాలు బీసీలను కించపరుస్తున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతామని బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తామన్నారు. బీసీల శత్రువులను గుర్తించాలనీ రెడ్డి వెలమ కమ్మ లకు విఆర్ఎస్ ఇవ్వాలన్నారు. బాక్వర్డ్ క్లాసెస్ పేరుతో రిజర్వేషన్లను 40 ఏళ్ల కింద అడ్డుకున్నారనీ బీసీ కులాలని పేర్కొంటే ఎప్పుడో రిజర్వేషన్లు బీసీలకు దక్కేవన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మోసం చేస్తున్నాయన్నారు.
బీజేపీలోని అగ్రవర్ణాల నేతలు రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు. అగ్రవర్ణ మీడియా బీసీలకు వ్యతిరేకం గా వ్యవహరిస్తుందని విమర్శించారు. తెలంగాణలో సినిమాలలో సాంస్కృతిక అరాచకం పెరిగిందన్నారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్ రావాలనీ ఒక్క శాతం కూడా ఇవ్వలేదన్నారు. బీసీలు ఎంగిలి మెతుకులకు ఆశపడొద్దన్నారు. ఆధిపత్య కులాల కుట్రలను ఎదిరించాలనీ బీసీలు ఐక్యంగా పోరాటాలు చేపట్టాలన్నారు. ఓసి లకు ఓట్లు వేయద్దనీ మన ఓట్లు బీసీలకే పడేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మేమెంతో మాకు అంత వాటా కావాలని డిమాండ్ చేశారు. 42 శాతము సాధించేవరకు నిద్దురపోవద్దన్నారు. అందుకు సాధన సమితి ఉద్యమ కార్యచరణ నిర్ణయిస్తుందని దాని ప్రకారం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. తెలంగాణలో రెడ్డిల ఆదిపత్యాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. నిజం వ్యతిరేక పోరాటం నుండి రెడ్డి రాజకీయాలకు ఆద్యుడు సురవరం ప్రతాపరెడ్డి అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి నయా సురవరం ప్రతాపరెడ్డి అన్నారు. కామారెడ్డికి కానిస్టేబులు కిష్టయ్య పేరు పెట్టాలనీ రంగారెడ్డికి పండుగ సాయన్న జిల్లా పెట్టాలనీ సభలో తీర్మానించారు. కామారెడ్డి ఆక్రోష సభ పాలకులపై అన్నారు. రాజ్యాంగంలోని తొమ్మిది షెడ్యూల్లో చేర్చి, అనంతరం స్థానిక సంస్థలను 42 శాతం రిజర్వేషన్లకు నిర్వహించాలన్నారు. బానిసలు పాలకుడికి పాలు పోస్తారన్నారు. బీసీలకు ఆక్రోశం తర్వాత విప్లవం వస్తుందనీ విప్లవం తర్వాత రాజ్యాధికారం దక్కుతుందన్నారు. ఘనంగా అట్టహాసంగా కామారెడ్డి బీసీ ఆక్రోష సభ నిర్వహించారు. కామారెడ్డికి కానిస్టేబుల్ కిష్టయ్య పేరు, రంగారెడ్డికి పండుగ సాయన్న జిల్లా పేరు పెట్టాలని బీసీ ఆక్రోశ సభ వక్తలు డిమాండ్ చేశారు. దేవుని పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తున్నారని, బీసీ నేతలు జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి చిరంజీవులు, ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తదితరులు చెప్పారు.
100 ఏళ్ల క్రితం తమిళనాడు రాష్ట్రంలో బీసీలు బడుగులు చైతన్యం అయ్యారన్నారు. మాదిగ కులం కు చెందిన విశారదన్ మహారాజ్ బీసీల రాజకీయాలు చేస్తే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారన్నారు. రాజ్యం కోసం బీసీలు యుద్ధం చేయాలన్నారు. రేవంత్ రెడ్డివి తుంటరి చర్యలనీ విమర్శించారు. మానవుడి కోర్కెలు దుఃఖానికి కారణమన్నారు. రాజ్యాధికారం కోసమే అగ్రవర్ణాలు పూజలు, గుడి రాజకీయాలు చేస్తున్నారు. బీసీలు కూడా రాజాధికారం కోసం గుడి రాజకీయాలు చేయాలన్నారు. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ కావాలని ఎంపీసీ బోర్డు ఏర్పాటు చేయాలని కామారెడ్డి డిక్లేషన్ సభలో ఇచ్చిన హామీలను విస్మరించారని మరిచిపోయారని వక్తలు విమర్శించారు. తమిళనాడు తరహా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బి సి రిజర్వేషన్ అమలు పరచాలని సభ తీర్మానించింది. తెలంగాణలో ప్రజలను మద్యం డబ్బు మాయమాటలతో మోసం చేస్తున్నారన్నారు.
అన్ని పార్టీల రాజకీయ నేతలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ విమర్శించారు. 42% బి సి రిజర్వేషన్లకు చెత్త ప్రకారం రోడు మ్యాప్ తయారుచేసి అమలుపరచాలని భక్తులు డిమాండ్ చేశారు వక్తలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో 42శాతం బిసి రిజర్వేషన్ సాధన సమితి ప్రతినిధులు మర్కంటి భూమన్న, ఎంజి వేణుగోపాల్ గౌడ్,ఖ్యాతం సిద్ధిరాములు, బాలా అర్జున్ గౌడ్, సుమిత్రానంద్, చాకలి రాజయ్య, లలిత, పుట్ట మల్లికార్జున్, డాక్టర్ రమేష్ బాబు, హరికిషన్ గౌడ్, వివిధ జిల్లాల చెందిన బిసీ నేతలు, ధర్మ సమాజ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.