01-11-2025 07:58:23 PM
మందమర్రి (విజయక్రాంతి): మిత అయ్యల్యార్ కుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వెంకటేశ్వరాలయంలో ఆదివారం నిర్వహించనున్న మంగళ కౌశిక ద్వాదశ యాగంలో పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకులు ధర్మపురి శ్రీనివాస్ కోరారు. మన గుడి కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో బాగంగా పట్టణ పురవీధుల్లో స్వామివారి తిరునామా సంకీర్తన, శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆలయంలో వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమం, యాగం నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని పట్టణ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.