పద్దెనిమిదేళ్ల విశేష సేవలకు ఘన వీడ్కోలు
హైదరాబాద్, ఆగస్టు 28: ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో 18 ఏళ్ల పాటు అంకితభావంతో సేవలందించిన హో మ్గార్డ్ వరలక్ష్మి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. అకాడమీ డై రెక్టర్, డీజీపీ అభిలాష బిస్త్, ఐపీఎస్ వరలక్ష్మిని సత్కరించి ఆమె సేవలను అభినందించారు. హోమ్గారడ్స్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. పదవీ విరమ ణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
190 మంది హోంగార్డులకు జాకెట్లు
అనంతరం అకాడమీలో విధులు నిర్వహిస్తున్న 190 మంది హోమ్గార్డ్స్కు ఖాకీ రంగు జాకెట్లను డైరెక్టర్ అభిలాష బిస్త్ పంపిణీ చేశారు. చలి, వర్షాకాలంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డి.మురళీధర్, కె.ఆర్.కె. ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్లు, డీఎస్పీలు, ఆర్‌ఐలు, ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.






