9 May, 2026 | 10:30 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

ఘనంగా లయోలా గ్రాడ్యుయేషన్ డే

26-01-2025 01:37 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): లోయోలా అకాడమీ 9వ గ్రాడ్యుయేషన్ డే శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 2023 -24 ఏడాదిలో ఉత్తీర్ణులైన 1,167 మంది పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేయగా, అందులో 987 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 180 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. వీ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, మానవీయ విలువలతో ఉండాలన్నారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ భవిష్యత్‌లో మరింత ప్రభావం చూపుతుందని వివరించారు.

ఓయూ ప్రొ. శశికాంత్, లయోలా కళా శాల సంచాలకులు రెవ. ఫా. డాక్టర్ ఎ. ఫ్రాన్సిస్ జావియర్, ప్రిన్సిపాల్  రెవ. ఫా డాక్టర్ ఎన్ బీ బాబు, రెవ. ఫా డాక్టర్ ఎల్‌ఎం థామస్, రెవ ఫా డాక్టర్ ఎఎం జోసెఫ్ కుమార్, రెవ ఫా ఎం అరుల్ జ్యోతి, రెవ ఫా ప్రభు ఆంథోనీ, పీ సుధాకర్, డాక్టర్ కేశ్రీనివాస్, డాక్టర్ పీ హిమబిందు, డాక్టర్ కేఈచీ విద్యాసాగర్, ప్రొఫెసర్ సక్రం తదితరులు పాల్గొన్నారు.