సర్టిఫికెట్ కాదు స్కిల్ కావాలి
- మహాత్మా జ్యోతిబాపూలే విధానాలను కొనసాగిస్తున్నాం
- చదువుతోనే కుల వ్యవస్థ నిర్మూలన, ఆత్మగౌరవం
- అందుకే యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్‌ను తెచ్చాం
- పేదవర్గాల బిడ్డలు ఎంపీలు, ఎమ్మెల్యేలై రాజ్యాలు ఏలొద్దా?
- పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్/రంగారెడ్డి, ఆగస్టు 14 (విజయక్రాంతి): సర్టిఫికెట్ కాదు స్కిల్లే ముఖ్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. ప్రజాపాల నలో మహాత్మా జ్యోతిబాపూలే విధానాలను కొనసాగిస్తున్నా మని స్పష్టం చేశారు. చదువుతో తలరాత మారి, సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. అన్ని వర్గాలు ఒకేచోట చదవు, జీవించడం ద్వారా కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు ఆత్మగౌర వం, గుర్తింపు, సమాజంలో తలెత్తుకునేలా చేస్తుంది.
అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ తీసుకువస్తు న్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను శుక్రవా రం ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, వాకి టి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను ఏటా రూ.2,40ం కోట్లు ముం దే జమ చేస్తున్నామని, ఈ ఏడాది నుంచి దీన్నీ అమల్లోకి తెచ్చామ న్నారు. కళాశాలల్లో ప్రవేశాలు పొందాక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే నెల రోజుల్లోనే ఫీజు జమ అవుతుందన్నారు. సాంకేతిక నై పుణ్యం ఉన్నవారికే ప్రపంచం ఎర్ర తివాచీతో స్వా గతం పలుకుతోందని, అలాంటి వారికి జర్మనీ, జపాన్, దక్షిణ కోరియాల్లో ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు.
ఏఐ వల్ల ఐటీ నిపుణుల ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చిందని, ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో అందరూ ఆలోచించాలన్నారు. అందుకే విద్యతో పాటు సాంకే తిక నైపుణ్యం నేర్పిస్తున్నామన్నారు. సాంకేతిక నైపుణ్యం సాధించిన వారికి జర్మనీ, జపాన్, దక్షిణ కోరియా పంపిస్తున్నట్లు సీఎం చెప్పారు. 150 యేళ్ల క్రితం జ్యోతి బాఫూలే చదువు ఒక్కటే మార్గమని తను చదువుకోవడమే కాకుండా తన సతీమణిని చదివించడం ద్వారా ఆదర్శం గా నిలబడ్డారని, అందుకు ఈ తరం కూడా ఆదర్శ పురుషుడిగా చేస్తున్నామంటే వారి ఆలోచన గొప్పతనమేనని అన్నారు.
నర్సరీ నుంచి బ్రేక్ ఫాస్ట్‌తో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇంజనీ రింగ్ సర్టిఫికెట్, డాక్టర్ సర్టిఫికెట్‌లు ఉంటే సరిపోదు. స్కిల్ ఉండాల్సిందేనన్నారు. అందుకే 2024 లో టాటా సంస్థతో కలిసి 119 నియోజ కవర్గాల్లో ఏటీసీలను ఏర్పాటు చేశామని తెలిపారు. క్రీడల్లో రాణించి పతకాలు తీసుకువస్తే నగదు నజరానాలతో పాటు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని స్పష్టం చేశారు.
సామాజిక చైతన్యంతోనే..
సామాజిక చైతన్యంతో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు దశాబ్దాలు కోట్లాడారు. ‘మీ రేవంతన్న దేశంలోనే మొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యను పరిష్కరించాం. బీసీ జనగణన చేయడానికి దేశంలో ఎవరూ ధైర్యం చేయలేదు. బ్రిటిష్ వాళ్ల తర్వాత మేం ఏడాదిలోనే బీసీ జనగణన చేసి బీసీల లెక్క తేల్చాంమన్నారు.
గత ప్రభుత్వంలో వాళ్ల పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలన్నది వాళ్ల ఆలోచన. బీసీలు రాజ్యాధికారంలో భాగం అడుగుతారన్న ఉద్దేశంతోనే గొర్రెలు, బర్రెలు పెంచుకోమని చెప్పారు. ఈ సమాజం చదువుకోవద్దా..? ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావొద్దా..? అన్నా రు. ‘నాణ్యమైన విద్యను, పౌష్టికాహారాన్ని అందిం చే బాధ్యత నాది. మీ బంగారు భవిష్యత్తు కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తా’ అని పేర్కొన్నారు.






