కేంద్రమంత్రి బండి సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్
15-01-2026 01:15 AM
కరీంనగర్, జనవరి 14 (విజయ క్రాంతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో 51 డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారు వేణు బుధవా రం బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ కండువా వేసి ఆహ్వానించా రు. బండారు వేణుతోపాటు 50 మంది బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. అ లాగే బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్ సాధినేని మునీందర్, రాంనగర్ కల్వకుంట్ల ప్రమోద్ రావు, మంకమ్మ తోట గాజె శివరాంలు బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జి ల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మే యర్ వై సునీల్ రావు, మాజీ డిప్యూటీ మే యర్ గుగ్గిళ్ళపు రమేష్, పాల్గొన్నారు.




