31 August, 2026 | 10:15 PM

Breaking News

కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •   కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!   •   24 గంటల విద్యుత్‌ కోసం రైతుల ధర్నా   •  

ఎమ్మెల్యే తీరుపై అర్ధనగ్న ప్రదర్శన

14-11-2024 12:12 AM

నాగర్‌కర్నూల్, నవంబర్ 13 (విజయక్రాంతి) : అధికార పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శనతో కూడిన వీడియోను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాలిలా.. తెలకపల్లి మండలం దాసు పల్లికి చెందిన చీమర్ల శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు.

అయితే అవినీ తికి పాల్పడుతున్న వారికి ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న వారిని వి స్మరిస్తున్నారని వాపోయాడు. దీనిపై నిజమైన కాంగ్రెస్ వాదులు ప్రశ్నించకపోతే రాబోయో రోజుల్లో పార్టీకి కష్టాలు తప్పవని హెచ్చరించారు. కాగా శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.