calender_icon.png 12 August, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సంక్షేమానికి హెల్త్ స్కీమ్ అవసరం

12-08-2025 12:28:04 AM

మంత్రి శ్రీధర్ బాబుకు టీఎన్జీవోల వినతి

కరీంనగర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కో సం కాంట్రిబ్యూషన్ ఆధారిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను త్వరితగతిన రూ పొందించి అమలు చేయడం అవసరమ ని టీఎన్జీవో నాయకులు తెలిపారు. సోమవారం నగరంలోని సుడా కార్యాలయంలో జిల్లా టీఎన్జీవోల సంఘం అధ్య క్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలో రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను టీఎన్జీవోల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, బొకే అందజేశారు.

ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా బెనిఫిట్స్ చెల్లింపుల ఆలస్యం, హెల్త్ స్కీమ్ అమలు అవసరాన్ని వివరించారు. గత కొంతకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్స్ అందడంలో ఆలస్యం జరుగుతుండటం, అలాగే హౌస్ బిల్డింగ్ లోన్స్, జి.పి.ఎఫ్. లోన్స్, టి.ఏ. బిల్లులు, జి.ఎల్.ఐ. బిల్లులు, వైద్య ఖర్చుల బిల్లులు వంటి చెల్లింపులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంఘం నాయకులు వివరించారు.

మంత్రి శ్రీధర్ బాబు స్పందించి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ విషయంలో త్వరలోనే తీపి కబురు వింటారని ఉద్యోగులకు భరోసా కల్పించారని దారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీఓల సంఘం అసోసియేట్ అధ్యక్షులు ఒంటేల రవీందర్ రెడ్డి, కేంద్ర సం ఘం నాయకులు నాగుల నరసింహస్వామి, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి శంకర్, నాయకులు ఎడ్ల మహేష్,అజయ్ కుమార్, తదితరులుపాల్గొన్నారు.