calender_icon.png 12 August, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ దొంగలు అరెస్టు

12-08-2025 12:28:02 AM

ఎల్బీనగర్, ఆగస్టు 11 : ద్విచక్ర వాహనాలను చోరీ చెస్తున్న ఇద్దరు దొంగలను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... గుంటూరు జిల్లాకు చెందిన కడియం హోసన్నా(21), కలివేల నాగేంద్రబాబు(23) ఇద్దరు కలిసి హైదరాబాద్ తోపాటు ఏపీ లోని గుంటూరు జిల్లాలో బైక్ లను చోరీ చేస్తున్నారు. నాగోల్ లోని ఆనంద్ నగర్ లో ఉన్న ఒక హాస్టల్ లో ఉంటున్న జి.భానుచరణ్ (19) జులై 11వ తేదీన రాత్రి 10  గంటలకు తన పల్సర్ బైక్ (TS 05FM2024) హాస్టల్ ఎదుట పార్క్ చేసి, వెళ్లాడు.

ఉదయం 8 గంటలకి నిద్ర లేచి చూసేసరికి బైక్ కనిపించ లేదు. బాధితుడు వెంటనే నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఎస్త్స్ర నర్సింహ ఆధ్వర్యంలో క్రైమ్ టీం సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను గుర్తించారు. ఈ క్రమంలో ఈ రోజు 11న ఉదయం 10 గంటలకు నాగోల్ ఎక్స్ రోడ్ దగ్గర నెంబర్ ప్లేట్ లేని బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణతోపాటు ఏపీ లోని గుంటూరు జిల్లాలో కూడా కొన్ని బైక్ లను దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన కడియం హోసన్నా, కలివేల నాగేంద్రబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగోల్ సీఐ ఏండీ మక్బూల్ జానీ తెలిపారు.