12-08-2025 12:29:01 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి భారతీయ పౌరుడు దేశభక్తిని చాటిచెప్పాలనే ఉద్దేశంతో బీజేపీ ‘హర్ ఘర్ తిరం గా’, ‘తిరంగా యాత్ర’ వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ ఐదేళ్ల నుంచి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నదని.. ఆరో ఏడాది కూడా రాష్ట్రంలో కార్యక్రమాన్ని విజయవం తం చేస్తామని వ్యాఖ్యానించారు. నిర్వహణ కోసం పార్టీ ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రత్యేకం గా ఓ కమిటీ ఏర్పాటు చేసిందన్నా రు. కమి టీ చైర్మన్‌గా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్‌రెడ్డి, సభ్యులుగా ఎమ్మె ల్యే హరీష్‌బాబు, పార్టీ అధికార ప్రతినిధి రాణి రు ద్రమ, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేంద ర్, ఎమ్మెల్సీ కొమురయ్య వ్యవహరిస్తారని వెల్లడించారు.
ఈనెల 14న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో 15 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ త లపెట్టామని వివరించారు. ప్రతి పౌరుడూ త మ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. భావితరాలకు స్వా తంత్య్ర ఉద్యమ చరిత్రను, త్యాగధ నుల త్యా గాలను వివరించేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.