18 July, 2026 | 4:22 PM

Breaking News

100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •  

అనాధ బాలల ఆత్మీయ సమ్మేళనం

19-05-2026 12:02 AM

జమ్మికుంట మే 18 (విజయక్రాంతి) :  అనాథ బాలల ఆత్మీ య సమ్మేళనాన్ని జ మ్మికుంట పట్టణంలోని  మారుతి నగర్  శ్రీ సత్య సాయి అనా ధ ఆశ్రమంలో ఘ నంగా నిర్వహించా రు.   28 సంవత్సరా ల క్రితం 30 మంది అనాధ బాలలు శ్రీ సత్యసాయి అనాధాశ్రమం చేరి  విద్యను అభ్యసించారు. క్రమశిక్షణతో చదువుకొని వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సోమవారం  ఆశ్రమంలో అనాధ బాలల సమ్మేళనాన్ని నిర్వహించి, చిన్ననాటి మిత్రులు కలుసుకున్నారు.

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనందంగా గడిపారు. అంతకుముందు విద్యాబుద్ధులను నేర్పి, అండగా నిలిచిన  ఆశ్రమ వ్యవస్థాపకుడు సూత్రపు బుచ్చి రాములను శాలువాలు, దండలతో సన్మానించారు. ఈ సందర్భంగా   ఆశ్రమ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ..... క్రమశిక్షణతో ఆశ్రమంలో చదువుకున్న కోట మధుకర్ మంచిర్యాల జిల్లా మంథనిలో అగ్రికల్చర్ ఏవోగా పని చేస్తున్నాడని, తంగాలపల్లి నాగరాజు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారని, బండారి రాజు శ్రీ సత్య సాయి ఆశ్రమం జమ్మికుంట లో ప్రిన్సిపాల్ గా  పనిచేస్తున్నారని.

నాంపల్లి సతీష్ కరీంనగర్ లో గల ఫ్రీడమ్ ఫైటర్ ట్రస్ట్ స్పెషల్ స్కూల్లో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారని, నాంపల్లి రేణుక దీప్తి సాయి భవాని సుకన్య హైదరాబాదులో గల ప్రముఖ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారని. సమతా స్వరూప సిరిసిల్ల జిల్లా నాంపల్లి గ్రామం లో సొంతంగా టైలరింగ్  చేస్తున్నారని, సామి దాస్ నవీన్ సొంతంగా ఆటో కొనుగోలు చేసి జీవనం కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ ఆశ్రమాన్ని ఆశ్రమంలో ఉన్న పిల్లల బాగోగులు చూసుకుని బాధ్యత అనాధ పిల్లలదే చెప్పారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పూర్వ అనాధ బాలలు మాట్లాడుతూ..... శ్రీ సత్య సాయి ఆశ్రమం మాకు జీవితాన్నిచ్చిందని ఈ సహకారాన్ని ఎప్పుడు మేము మర్చిపోలేమన్నారు. ఆశ్రమంలోని విద్యార్థులందరికీ ఏదో ఒక విధంగా సహాయపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ  అనాధ బాలలు ఉన్నారు.