27 July, 2026 | 6:06 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుంది

04-06-2026 02:28 AM

ఎస్పీ నితికా పంత్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలో నిర్వహించిన ఫుట్ పెట్రోలింగ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను అభినందిస్తూ ఇలాంటి వారే బెస్ట్ సిటిజన్స్ ఇన్ ఆసిఫాబాద్ అని కొనియాడారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు.  కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, టౌన్ ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఇన్స్పెక్టర్లు రమేష్, వేణుగోపాల్, ఎస్త్స్రలు మధుకర్, రవికుమార్, విక్రమ్, మహేందర్, ఉల్లాస్, శ్యామ్ రామ్, మోహన్ కుమార్, పోలీసు , స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.