చెరువు కట్ట అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, జూన్ 3: మిర్యాలగూడ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడంతో పాటు ప్రజారోగ్యం అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా ఉన్నత ప్రమాణాలతో పనులు చేపట్టాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ ఆర్)అన్నారు.
బుధవారం చిన్న చెరువు కట్ట ఆధునీకి కరణ పనులను మురుగునీటి శుద్ధి కేంద్ర నిర్మాణ ప్రగతిని ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను నిశితంగా పరిశీలించి చిన్న చెరువు కట్ట నిర్మాణ పనులను పరిశీలించి వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కట్టను మరింత పటిష్టంగా నిర్మించాలని అధికారులకు పలు సూచన చేశారు.
కట్టపై ప్రజల కోసం వాకింగ్, ట్రాక్,లైటింగ్ పచ్చదనం వేగవంతం పెంపొందించే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న ఎస్టిపి ప్లాంట్ సామర్థ్యం, మురుగునీటి శుద్ధి ప్రక్రియ సాకేతికతను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి పనుల్లో ఎక్కడా నాణ్యత ప్రమాణాలను విస్మరించకుండా ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లకుండా నిర్దేశిత కార్మికులకు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజారోగ్య శాఖ అధికారులు నిరంతరం పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ అధికారులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ,నాయకులు బంటు లక్ష్మీనారాయణ, మేడ మహేందర్ రెడ్డి తదితరులున్నారు.






