26 July, 2026 | 5:14 PM

హిందూ ముస్లిం పెండ్లి చెల్లదు

31-05-2024 12:46 AM

ఇందుకు ముస్లిం పర్సనల్ లా ఒప్పుకోదు

మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు

భోపాల్, మే 30: ముస్లిం యువకుడు, హిందూ యువతి పెండ్లి చేసు కొంటే.. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ పెండ్లి చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం లా ప్రకారం ముస్లిం పురుషుడు, హిందూ మహిళ మధ్య జరిగే వివాహం ఇర్రెగ్యులర్ అని జస్టిస్ గుర్‌పాల్‌సింగ్ అహ్లూ వాలియా గురువారం ప్రకటించారు. ఒకవేళ వాళ్లు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం వివాహం చేసుకొన్నా.. అది చెల్లదని స్పష్టంచేశారు. మతాంతర వివాహం చేసుకొన్న ఒక జంట తమ పెండ్లిని స్పెషల్ మ్యారేజ్ చట్టం ప్రకారం రిజిస్టర్ చేసేలా అధికారులను ఆదేశించాలని రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం ఆ పెండ్లే చెల్లదని తేల్చి చెప్పింది.