ముల్క నూరులో చారిత్రక శిల్పం
కాటమయ్య గుండుపై అయ్యదేవుడు
భీమదేవరపల్లి, ఆగస్టు 16 (విజయక్రాం తి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఇటీవలే కళ్యాణీ చాళుక్యుల శాసనాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుడికందుల కిషోర్, సిద్ధమల్ల రమేష్ మరో చారిత్రక శి ల్పాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కళ్యాణి చాళుక్యుల శాసనం ఒక పరుపుబండపై ఉం డగా దీనికి ఎదురుగా కొంత దూరంలో ఒక పెద్ద రాతి గుండు ఉంది. దీన్ని స్థానికులు ‘కాటమయ్య‘ గుండుగా పిలుస్తారు.
ఈ గుండు కు ఉత్తరాభిముఖంగా మూడు అర్థ శిల్పాలు ఉన్నాయి. వాటిలో గుర్రాన్నెక్కి కుడిచేత” ఆ యుధాన్ని భుజం మీద పెట్టుకుని, ఎడమచేత కళ్ళెం పట్టుకున్న అయ్యదేవుడిని స్థానిక ప్రజలు కాటమరాజుగా పిలుస్తున్నారు. అత ని గుర్రం ముందు ఒక కుక్క ఉంది. గ్రామాలను రక్షించే అయ్యదేవుళ్లను ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధంగా పిలుస్తారు. కొన్ని ప్రాం తాల్లో కాటమయ్య అని పిలువగా మరికొన్ని ప్రాంతాల్లో కాటమరాజుగా పిలుస్తారు.
ఈ శిల్పాలు కళ్యాణి చాళుక్యుల కాలానికి దగ్గర గా ఉన్నాయని, అయితే ఇవి ఎక్కువగా స్థానికంగా చేయించినవి కావడం వల్ల భిన్నమైన శైలిలో ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షులు శ్రీరామోజు హరగోపాల్ స్పష్టం చేశారు. అయ్యదేవుని వెనుక, చేతుల్లో పూజా ద్రవ్యాలతో ఒక స్త్రీ శిల్పం ఉంది. అయ్యదేవుడు కొన్ని సార్లు ‘దేవేరి‘ తో కనిపిస్తాడని, ఇక్కడ పూర్తి భిన్నంగా ఉ న్నాడని తెలిపారు. ఈ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధులకోసం త్రవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. స్థానికులు ఒక ముఠాగా ఏర్పడి ఇటీవలనే డిక్టేటర్ సహాయంతో త్రవ్వకాలు జరిపారని, రాత్రిళ్లు చా లాసార్లు జంతు బలులు ఇచ్చారని స్థానికు లు వెల్లడించారు.






