17 August, 2026 | 2:19 AM

‘నెజోస్ హెర్బల్, మినరల్ వెల్నెస్ డ్రాప్స్’

17-08-2026 01:44 AM

హైదరాబాద్ బంజారహిల్స్‌లో ఆవిష్కరణ

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన స్పెక్ట్రా ఫ్లేవర్స్ అండ్ ఎమల్షన్స్ సంస్థ ‘ఎన్‌ఈజేవోఎస్ హెర్బల్ అండ్ మినరల్ వెల్నెస్ డ్రాప్స్’ను ఆవిష్కరించింది. శుద్ధి చేసిన తాగునీటిలో ఎంపిక చేసిన ఖనిజాలు, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ను జోడించేలా ఈ ఉత్పత్తిని రూపొందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో అలీప్ అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి, టీఐఎఫ్ అధ్యక్షుడు కె. సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్వో వంటి శుద్ధి ప్రక్రియల్లో తగ్గే అవకాశం ఉన్న ఖనిజాలను దృష్టిలో పెట్టుకుని నేజోస్‌ను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియంతో పాటు తులసి, అల్లం, పుదీనా ఎక్స్ట్రాకట్స్ ఉన్నాయి. దండుమల్కాపూర్ ఎంఎస్‌ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో అభివృద్ధి చేసిన ఈ ఉత్పత్తిని తొలుత హైదరాబాద్ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చి, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.