ముత్యాలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
సూర్యాపేట, ఆగస్టు 16 (విజయక్రాంతి) : ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో సూర్యాపేట ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పలు ముత్యాలమ్మ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలో చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25వ వార్డులో కృష్ణ టాకీస్ సమీపంలోని శ్రీ ఊర ముత్యాలమ్మ దేవాలయం, 48వ వార్డులోని కోట మైసమ్మ దేవాలయం, 16వ వార్డులోని బేచిరాగ్ మదారం శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, 1వ వార్డులోని ముత్యాలమ్మ తల్లి దేవాలయం, 2వ వార్డులోని ముత్యాలమ్మ తల్లి దేవాలయాలను వారు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, జిల్లా యువజన అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్, అబ్దుల్ రహీం, కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, కొండపల్లి దిలీప్ రెడ్డి, మన్నెం అరుణ మల్లేష్, గుణగంటి హేమ సతీష్, కోడి శిరీష శివ, జహీర్, తన్వీర్ హుస్సేన్, చెంచాల మణిలత శ్రీనివాస్, బానోతు సైదులు, శ్రీ దండు మైసమ్మ దేవాలయ చైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






