6 July, 2026 | 1:26 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ముర్తుజగుడాలోని 12వ వార్డులో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

20-03-2026 12:00 AM

మొయినాబాద్ మార్చి 19 (విజయ క్రాంతి) మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తుజగూడలోని 12వ వార్డులో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లోనూ వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు.

నేరాల నియంత్రణ శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ దుబ్బ సోనియా దర్శన్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మొయినాబాద్ కౌన్సిలర్లు పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, విక్రం రెడ్డి, గీతా వనజాక్షి, వాజీద్, నాయకులు జైపాల్ రెడ్డి, నేరెట్ల రాజు గౌడ్, మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదిదారులు పాల్గొన్నారు.