6 July, 2026 | 1:13 PM

Breaking News

కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •  

ములుగు జిల్లాలో భారీ చోరీ

06-07-2026 12:26 PM

వెంకటాపురం: ములుగు జిల్లా(Mulugu district) వెంకటాపురం మండలం గుంటూరుపల్లి గ్రామంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు ఒక ఇంట్లోకి చొరబడి, విలువైన వస్తువులు, ముఖ్యమైన భూమి పత్రాలను అపహరించుకుపోయారు. ఈ ఘటన మోతే రమ నివాసంలో చోటుచేసుకుంది. దుండగులు సుమారు 22 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు ఆరోపించారు. అలాగే, ఇంట్లో భద్రపరిచిన కీలకమైన భూమి పత్రాలను కూడా వారు తీసుకువెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు(Police) కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించడానికి, దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.