ఐదుగురిని హతమార్చి.. ఆపై ఆత్మహత్య
బలోదాబజార్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బలోదాబజార్ జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు సుత్తి, కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ హత్యలకు ప్రేమ వ్యవహారమేనని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం ఇస్తూ, సారంగర్ బిలాయిగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పుష్కర్ శర్మ మాట్లాడుతూ.. ఈ మారణకాండలో మరణించిన వారిని హేమ్‌లాల్, జగ్మతి, మీరా, మీరా కొడుకు, ఇద్దరు పిల్లలుగా గుర్తించామన్నారు. ప్రాథమిక విచారణలో హంతకుడు పొరుగునే ఉన్న పప్పు టేలర్‌గా గుర్తించామని పేర్కొన్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించామని పోలీసులు తెలిపారు






