17 June, 2026 | 8:39 PM

Breaking News

20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •  

జాక్‌తో లాఫింగ్ రైడ్

25-09-2024 03:15 AM

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘జాక్’. ఈ సినిమాకు ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్‌ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. ‘బేబి’ సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా 80 శాతం పైగానే చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం షెడ్యూల్ షూటింగ్ నేపాల్లో శరవేగంగా జరుగుతోంది. ప్రకాశ్ రాజ్, వైష్ణవి చైతన్య తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సోమవారం చిత్ర దర్శకుడు భాస్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెట్స్‌లో ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి.

అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. తనను తాను క్రాక్ గాడు అనుకునే జాక్ తో బ్యూటీ ‘బేబి’ వైష్ణవి చైతన్య లాఫింగ్ రైడ్ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే సినిమా విడుదయ్యేదాకా ఆగాల్సిందే.