గృహ కార్మికుల సామాజిక భద్రతకు చట్టం చేయాలి
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ముషీరాబాద్, జూన్ 16 (విజయక్రాం తి): గృహ కార్మికుల సమగ్ర సంక్షేమానికి సామాజిక భద్రతకు ప్రభుత్వం గృహ కార్మికుల చట్టాన్ని చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ (డి బిఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గృహ కార్మికుల జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సదస్సులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాలలో ఉపాధి లేక అనేక కుటుంబాలు పట్టణాలకు వలసలకు వచ్చి మహిళలు గృ హ కార్మికులుగా, పురుషులు వాచ్మెన్ లుగా జీవిస్తూ అర్ధాకలితో ఆల్మట్టిస్తున్నారని అన్నా రు. అనేక పోరాటలతో రాష్ట్ర ప్రభుత్వం గిగ్ కార్మికులకు చట్టం చేసినట్లే గృహ కార్మికుల చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించి అమలు చేయాలని కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గృహ కార్మికుల సమగ్ర చట్టాన్ని తీసుకువచ్చే విధంగా తమ కమిషన్ పనిచేస్తుందని చెప్పారు. మానవ హక్కుల వేదిక రెండు రాష్ట్రాల సమన్వయకర్త జీవన్ కుమార్ మాట్లాడుతూ గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ మాట్లాడుతూ గృహ కార్మికులకు కనీస వేతనాలు లేక సొంత ఇల్లు లేక నరకాయాతన పడుతున్నందున వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
హైదరాబా ద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పులి కల్పన మాట్లా డుతూ గృహ కార్మికులపై దొంగతనం పేరు తో పోలీసులు యజమానులు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో భారత రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేశారు. దళిత బహుజన ఫ్రంట్ నాయకులు రాజేష్, కృష్ణ, యాదమ్మ, శారద, మీనా, రంగమ్మ, సుధాకర్ ,రవి ప్రశాంత్ పాల్గొన్నారు.






