పసి పిల్లలకు తొలి ముద్ద ఆరోగ్యానికి ఎంతో మేలు
20-07-2026 04:17 PM
బోథ్,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న తొలిముద్ద కార్యక్రమం పసిపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడి కేంద్రంలో తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో అనేకమంది విద్యార్థుల జీవితాలలో వెలుగు నిండుతుందని ఆరోగ్యంగా ఎదుగుతారు అన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలందరికీ ఈ కార్యక్రమం ఉపకరించే విధంగా చూడాలని ఆమె కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ తో పాటు సన్నీ రెడ్డి ,పాఠశాల ఉపాధ్యాయులు అక్షయ ,అంగన్వాడి టీచర్ సుమలతలు పాల్గొన్నారు.






